ఆస్కార్ నీడలో “జల్లికట్టు”

  • Written By: Last Updated:
ఆస్కార్ నీడలో “జల్లికట్టు”

ఆస్కార్ సందడి మొదలు కాబోతుంది. సినిమా ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల ఆస్కార్ అవార్డ్ ఎలాగైనా గెలుచుకోవాలని. అందుకోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఈసారి జరగబోయే అవార్డ్ వేడుకలకు ప్రపంచ దేశాల సినిమాలు లైన్లు కడుతున్నాయి. అందులో మన దేశం నుండి కూడా ఉత్తమ సినిమాల జాబితాను పంపించడానికి సిద్దం చేసింది. ఉత్తమ ఎంట్రీ చిత్రాలుగా అమితాబ్ నటించిన “గులాబో సీతాబో”, “చాలెంజ్‌”, “ది డిసైపుల్‌”, “మూతాన్‌”, “బిట్టర్‌ స్వీట్‌”, “జల్లికట్టు” మొదలగు సినిమాలు ఉన్నాయి.

మలయాళ దర్శకుడు లీజో జోస్‌ పెలిసెరీ డైరక్షన్ లో వచ్చిన చిత్రం “జల్లికట్టు” 2019 అక్టోబర్‌ 4న విడుదలై మంచి ప్రశంశలు అందుకుంది. ఈ చిత్రం యొక్క కథాంశం ఏమిటి అంటే ఓ కసాయి దుఖానమ్ నుండి దున్నపోతు తప్పించుకుని, ఓ ఊరిలో కి ప్రవేశిస్తుంది. ఆ ఊరి గ్రామస్తులు దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ క్రమంలో ఆ ఊరిని, వాళ్ళను ఏ విదంగా మార్చింది అనేది కథ. ఇప్పుడు ఆ చిత్రాన్ని ఆస్కార్ కి ఉత్తమ్ విదేశీ ఎంట్రీ చిత్రం గా పంపుతూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. ఆ చిత్రం బూసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ నుండి మంచి ప్రశంసలు అందుకుంది.

ఆ చిత్రంలో శాంతి బాల చంద్రన్, ఆంటోనీ వర్గీస్, చెంబన్‌ వినోద్‌ జోస్ ముఖ్య పాత్రలో నటించారు. మరి జల్లికట్టు సినిమాకు ఆస్కార్ తీసుకురావాలని విష్ చేద్దాం.

follow us