‘యువ శక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్న జనసేనాధినేత

‘యువ శక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్న జనసేనాధినేత

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవడం, వాటికీ భరోసా ఇవ్వడం చేసారు. ఇక ఇప్పుడు ‘యువశక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. జనవరి 12న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది.

రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే ‘యువ శక్తి’ సభలు నిర్వహిస్తున్నట్టు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పలు జిల్లాల్లో ‘యువ శక్తి’ సభలు జరుపుతామని చెప్పుకొచ్చారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా విజయం సాదించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రజల్లోనూ ఆదరణ భారీగా పెరిగింది. జగన్ , చంద్రబాబుల పాలనా చూసాం..ఈసారి పవన్ కు ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.

follow us