జనసేన ‘వారాహి’ వెహికిల్ నెం మాములుగా లేదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన టెస్ట్ కు తగ్గట్లు ప్రచార రథాన్ని సిద్ధం చేసారు. దీనికి వారాహి అనే పేరు పెట్టారు. కాగా ఈ వారాహి పిక్స్ బయటకు వచ్చిన దగ్గరి నుండి వైస్సార్సీపీ నేతలు వారాహి కలర్ ఫై పలు అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ వైస్సార్సీపీ నేతలు ప్రశ్నించడం , ఈ వారాహీకి రిజిస్ట్రేషన్ కూడా జరగదని కామెంట్స్ వేశారు.
కానీ తెలంగాణ రవాణా శాఖ మాత్రం ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. అలాగే వాహనానికి తెలంగాణ రవాణా శాఖ TS 13 EX 8384 నెంబరు కేటాయించినట్టు తెలిపారు. ఇక తెలంగాణ రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో వైస్సార్సీపీ నేతలు షాక్ లో పడ్డారు.