నయనతార బాటలో జాన్వీ కపూర్ !

నయనతార బాటలో జాన్వీ కపూర్ !

నయనతార తెలుగు, తమిళ్ చిత్రాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ చెయ్యాలంటే అది కచ్చితంగా నయనతార చేస్తేనే మంచి విజయం సాదిస్తుందనే పేరు ను రెండు రాష్ట్రాల ప్రేక్షకులనుండి సంపాదించుకుంది. తను నటించిన వాటిలో ముఖ్యమైనవి ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’ వంటి చిత్రాలు మంచి విజయం సాదించాయి. నయనతార అతి తక్కువ కాలంలోనే 65 సినిమాలను పూర్తి చేసింది.

నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ అనే చిత్రంను హిందీలో రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి సిద్థార్థ్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తాడు. ఆనంద్ ఎల్. రావు. నిర్మించనున్నాడు జనవరి 9 నుండి పంజాబ్ లో షూటింగ్ జరుపుకోబోతుంది. నయనతార బాటలో జాన్వీ కపూర్ ప్రయాణం కొంసాగించాలి అనుకుంటునట్లుగా ఉన్నది. ‘రూహీ ఆఫ్జా’, ‘దోస్తానా 2’ చిత్రాలతో జాన్వి బిజీగా ఉన్నది.

ఇక నయనతార విషయానికి వస్తే ఆమె ప్రియుడు విగ్నెష్ శివన్ నిర్మాణంలో ‘నెట్రిక్కన్’ అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి మిళింద్ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అందురాలి పాత్రలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

follow us