REVIEW :న‌వ్వులు పూయించిన జాతిర‌త్నాలు..!

jathi ratnalu movie review rating
jathi ratnalu movie review rating

నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాలో ఫరీదా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించగా…ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ సినిమా నుండి విడుదలైన చిట్టి అనే పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా సినిమా టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా అంచనాలను రీచ్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

క‌థ‌ :సొంత ఊర్లో లేడీస్ ఎంపిరియం నడిపించే నవీన్ పొలిశెట్టి మంచి ఉద్యోగం చేయాలనే ఉద్ధేశ్యం తో స్నేహితులు రాహుల్, ప్రియదర్శి లతో కలిసి హైదరాబాద్ లో అడుగు పెడతాడు. ఈ క్రమంలో ముగ్గురూ ఓ ఎమ్మెల్యే మర్డర్ కు స్కెచ్ వేశారు అంటూ ఆరోపణలు రావడం తో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అసలు ఈ ముగ్గురిని జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే మర్డర్ ప్లాన్ కేసులో ఎందుకు ఇరుక్కున్నారు. అసలు జైలు నుండి బయట పడ్డారా లేదా అన్నదే సినిమా కథ.

విశ్లేషణ : సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. గ్యాప్ లేకుండా వచ్చే కామెడీ సన్నివేశాలతో పొట్ట చెక్కలెయ్యలా నవ్వుకోవచ్చు. తమ తమ పాత్రల్లో ముగ్గురూ హైలెట్ గా నటిస్తారు. దాంతో ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్ లతో కథ అలా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కొంత లాగ్ అవుతుంది. కామెడీ పైనే అతి శ్రద్ధ పెట్టి అసలు కథను పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది. సీరియస్ సన్నివేశాలను కూడా అనవసర కామెడీ సన్నివేశాలుగా మార్చారని అనిపిస్తుంది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్లు అయితే లాజిక్ లెస్ గా తెరకెక్కించారని అనిపిస్తుంది. మళ్ళీ చివర్లో వచ్చిన కామెడీ సన్నివేశాలు సినిమాను పైకి లేపుతాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కు కొదువ ఉండదు. దాంతో భాగా నవ్వుకోవచ్చు. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

ప్లస్ లు&మైనస్ లు : సినిమాలో నవీన్ పోలిశెట్టి నటన చాలా బాగుంది. ఇప్పటికే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఆకట్టుకున్న నవీన్ ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ అనుదీప్ రైటింగ్ లో మంచి ప్రతిభ కనబరిచారు. ట్రెండింగ్ పంచ్ లతో నేటి తరానికి భాగా కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకులు భాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సినిమాలో మైనస్ ల విషయానికి వస్తే రచన బాగున్నప్పటికి కథ పరంగా చూసుకుంటే నిడివి భాగా తగ్గించవచ్చు. అనవసరంగా సినిమా టైం ను పెంచారనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కిక్ సెకండ్ హాఫ్ లో ఉండదు దాంతో క్లైమాక్స్ కు వచ్చేసరికి సినిమా డల్ అయిపోతుంది. కామెడీ బేస్ గా వచ్చిన సినిమాలో లాజిక్ లు వెతకడం అత్యాశ అయినప్పటికీ చిన్న చిన్న లాజిక్ లను కూడా మిస్ అవ్వడం కాస్త మైనస్ గా అనిపించింది.