తండ్రి కాబోతున్న అగ్ర దర్శకుడు

తండ్రి కాబోతున్న అగ్ర దర్శకుడు

తమిళ్ టాప్ డైరెక్టర్ అట్లీ తండ్రికాబోతున్నాడు. 2014లో శ్రీకృష్ణప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్న అట్లీ ..వరుస విజయాలతో అతి తక్కువ టైంలోనే టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అట్లీ..త్వరలోనే మా కుటుంబం పెద్దది కాబోతోంది అంటూ అధికారికంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. తల్లిదండ్రులు కాబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వారికి అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

ఇక అట్లీ సినిమాల విషయానికి వస్తే.. వరుసగా విజయ్ తో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు.

follow us

Related News