ముగ్గురు భామలతో బాలయ్య సందడి మాములుగా లేదు

ముగ్గురు భామలతో బాలయ్య సందడి మాములుగా లేదు

బాలకృష్ణ వెండితెర ఫైనే కాదు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఫై కూడా అందమైన భామలతో సందడి చేస్తున్నాడు. ఓ పక్క సినిమాలు , రాజకీయాలతో బిజీ గా ఉండే మరోపక్క హోస్ట్ గా కూడా బిజీ గా ఉన్నారు బాలయ్య. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా లో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. రీసెంట్ గా ప్రభాస్ సైతం హాజరై ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ నెల 30 నుండి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది.

తాజాగా మరో ఇద్దరు సీనియర్ నటీమణులతో పాటు ఈ తరం యంగ్ బ్యూటీ ఈ షో కు హాజరయ్యారు. సహజన నటి జయసుధ.. అందాల తార జయప్రదలను ఈ షో కు హాజరు పరిచారు. అలాగే యంగ్ బ్యూటీ రాశిఖన్నా సైతం వీరితో పాటు సందడి చేసింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేసారు. ఈ ప్రోమో లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి సందడి చేయడం ఆసక్తి రేపుతోంది.

ఈ సందర్భంలోనే రాశీఖన్నానీ నీకు ఏ హీరో మీద క్రష్ ఉందంటే? ఆమె వెంటనే విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఈ భామ గతంలో దేవరకొండంతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో నటించిన సంగతి తెలిసిందే. సీన్ డిమాండ్ చేయడంతో ఇంటిమేట్ సన్నివేశాల్లో భాగంగా బెడ్ రూమ్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అందుకే కావొచ్చు విజయ్ అంటే క్రష్ అనింది అని అంత మాట్లాడుకుంటున్నారు.

follow us