జగన్ కి సామాజిక వర్గం లేదా.. ?

జగన్ కి సామాజిక వర్గం లేదా.. ?

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తనదైన శైలిలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ , జడ్పీటీసీ ఎన్నికల గురించి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించమని ప్రకటించారు. దేనివల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని అన్నారు. టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని , జగన్ చాలా తెలివైనవాడని , టీడీపీ పార్టీవాళ్ళం అతి కష్టమ్మీద నామినేషన్లు వేశాం. నామినేషన్లు ఇలా వేస్తే పోలింగ్ సవ్యంగా జరిగే అవకాశాలు తక్కువ. దౌర్జన్యం జరుగుతుందని ప్రతి పోలింగ్ బూత్ లలో సీసీ కెమెరాలు పెట్టాలని అలా పెడితే దౌర్జన్యం తగ్గే సూచనలు ఉంటాయి. సీసీ కెమెరాలకు డబ్బుల్లేకుంటే మా పార్టీ భరిస్తుందని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి.

ఇంకా వైస్ జగన్ సామాజిక వర్గం లేదా ఆయనకి చెందిన సామాజిక వర్గం ఎక్కడ లేదో చెప్పండి అంటూ జగన్ మీద ఫైర్ అయ్యారు .

follow us