ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమాపై అల్లుఅర్జున్ కామెంట్

గతేడాది 2020 సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘అల.. వైకుంఠపురములో’ రీయూనియన్‌ను హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే, విలన్ సముద్రఖని, ఇతర నటీనటులు శశాంక్, సునీల్, నవదీప్‌తో పాటు టెక్నీషియన్స్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘కోవిడ్‌కి ముందు ఏడాదిన్నర ఇంట్లో కూర్చున్నా.. ఆ తరువాత కూడా ఒక సంవత్సరం ఇంట్లో కూర్చున్నా ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎందుకంటే, ఈ సినిమా అంత ఎనర్జీ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోలతో పోల్చుకుంటూ తన రికార్డును ప్రస్తావించారు అల్లు అర్జున్.. ప్రతి నటుడికీ ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏడో సినిమా ‘సింహాద్రి’ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం.. నాకు 20 సినిమాలు పట్టింది. నాకెప్పుడు పడుతుందని నేను కూడా అనుకునేవాడిని ఈ సినిమాతో తీరిందని’ బన్నీ చెప్పుకొచ్చాడు.