నా కాలు పట్టుకొని ఎన్టీఆర్ అలా చేశాడు..నటి సుధ

  • Written By: Last Updated:
నా కాలు పట్టుకొని ఎన్టీఆర్ అలా చేశాడు..నటి సుధ

టాలీవుడ్ సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇండస్ట్రీ గురించి, ఆమె పనిచేసిన హీరోల గురించి తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సుధ, జూ. ఎన్టీఆర్ గురించి చెప్తూ అతనిలాంటి హీరోను తాను ఇంతవరకు చూడలేదని చెప్పుకొచ్చింది. సుధ, తారక్ నటించిన బాద్షా చిత్రంలో నటించింది. అందులో తారక్ తో పాటు పెద్ద ఎన్టీఆర్ సాంగ్ కు డ్యాన్స్ కూడా వేసింది. ఇక ఆ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి సుధ మాట్లాడింది.

“బాద్షా సినిమా జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ సెట్ కు వచ్చాడంటే గోల గోలే. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఒక సాంగ్ కు డ్యాన్స్ వేయాలి. అందరం రిహార్సల్స్ చేస్తున్నాం. ఆ సమయంలోనే నా కాలు మెలికపడి కిందపడిపోయాను. వెంటనే నా కాలు వాచిపోయింది. నొప్పితో విలవిల్లాడుతున్న నా దగ్గరకు తారక్ వచ్చి నా కాలు పట్టుకొని నొప్పి ఉన్న దగ్గర నొక్కుతూ ఏం కాదు ఏం కాదు అని ఓదార్చాడు. అసలు ఒక హీరోకు అలా చేయాల్సిన అవసరం లేదు. దెబ్బ తగిలింది కదా చూద్దాం అని కూర్చోలేదు. వెంటనే ఒక మనిషిగా స్పందించాడు. అదే తారక్ లో ఉన్న గొప్ప లక్షణం. అందుకే తారక్ అంటే నాకు చాలా ఇష్టం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుధ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

follow us