“పుష్ప” లో జూనియర్ ఎన్‌టి‌ఆర్ జీవితం !

“పుష్ప” లో జూనియర్ ఎన్‌టి‌ఆర్ జీవితం !

రామ్ చరణ్ తేజ్ రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో , అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో పుష్ప అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గందపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తాడని. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో నందమూరి ఎన్‌టి‌ఆర్ (జూనియర్ ఎన్‌టి‌ఆర్ ) జీవితంలో జరిగిన సంఘటనలను చూపించబోతునట్లుగా సినీ వర్గాల కథనాలు. జూనియర్ ఎన్‌టి‌ఆర్ తో, సుకుమార్ “నాన్నకు ప్రేమతో” అనే చిత్రం ను తీశాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య కాస్త ఎక్కువ చనువు ఏర్పడటంతో, ఎన్‌టి‌ఆర్ తన చిన్న తనలో జరిగిన విషయాలను చెప్పినట్లుగా సమాచారం.

గొప్ప ఇంట్లో పుట్టి నాన్న కు దూరంగా ఉంటూ అమ్మ దగ్గర పెరగడంతో ఆమె వద్దే, నాట్యం, నటన నేర్చుకొని సినిమాను ఛాలెంజ్ గా తీసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. తన నటనతో నందమూరి ఫ్యాన్స్ ను మొత్తం తన వైపుకు లాగేసుకున్నాడు. ఫ్యాన్స్ విషయంలో బాలకృష్ణ తర్వాత ఎన్‌టి‌ఆర్ అనే విదంగా ఎదిగాడు. సుకుమార్ ఎన్‌టి‌ఆర్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సారాంశంగా తీసుకొని వాటిని అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో మిక్స్ చేస్తూ చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకు ఎన్‌టి‌ఆర్ కుడా పర్మిషన్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. పుష్ప రిలీజ్ రోజు అల్లు ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ తో థియేటర్ లో ఈలలు గోలలతో దద్దరిల్లేలా ఉంది.

follow us