ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సెలబ్రెటీలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా తాజా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు.
ప్రస్తుతం న కుటుంబం తో కలిసి నేను ఐసోలేషన్ లో ఉన్నాను. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాము. ఇటీవల నన్ను కలిసిన వాళ్ళు దయచేసి టెస్ట్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ కరోనా బారిన పడటం తో అభిమానులు ఆందోన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా తరవాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారు.