కే ఏ పాల్ : పవన్ కళ్యాణ్ నీ డాన్సులు ఏవో నువ్వు వేసుకోవచ్చు కదా … !

కే ఏ పాల్ : పవన్ కళ్యాణ్ నీ డాన్సులు ఏవో నువ్వు వేసుకోవచ్చు కదా … !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం తన ఫేస్‌బుక్ పేజీ లైవ్‌లో మాట్లాడిన ఆయన, బీజేపీ-జనసేన పొత్తు విషయంగా ఈ విధంగా స్పందించారు, పవన్ పవర్ కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. జనసేనకు 5-6 శాతం ఓట్ల కంటే ఎక్కువ రావని కూడా ముందే చెప్పానాని పాల్ అన్నారు. “పోటీ చేసిన చోట పవన్ ఓడిపోతాడని కూడా చెప్పాను. పవన్ తమ్ముడు నీకు అంత పవర్ హంగ్రీ ఉండటం మంచిది కాదు. పవన్ ను చూస్తే విచారంగా ఉందని, 2008లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ ఏజెంట్‌ని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

పవన్ ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్నారని మాయవతి ప్రధాని ఆయన ముఖ్యమంత్రి అవుదామని భావించారని కానీ మోదీ అధికారంలోకి ఉన్నారని నడ్డా, అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని అన్నారు . రైతులకు న్యాయం జరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాలి కానీ ఎందుకు హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో అంత క్లోజ్ కనెక్షన్ ఉంటే..స్పెషల్ స్టేటస్ తెచ్చి చూపించు”  అని సవాల్ చేసారు. బీజేపీకి చెప్పి ప్రత్యేక హోదా తీసుకొస్తే అప్పుడు ప్రజలు పవన్ ను నమ్ముతారని అన్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు చంద్రబాబుతో ఉండి.. చంద్రబాబు పలుకులు పలికి.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటని ప్రశ్నించారు.  ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అని పాల్ అన్నారు.

Tags

follow us