చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల

చిత్రసీమ మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈరోజు శుక్రవారం (డిసెంబర్ 23) ఉదయం కన్నుమూశారు. ఎస్వీ రంగరావు తర్వాత ఆ స్థాయి అందుకున్న సత్యనారాయణ. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల, నాటకాల్లో రాణించి.. ఆ అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టారు.

నవరసాలను పండించే నటుడిగా, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించాడు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఆయన చేయని పాత్ర లేదు. సాంఘిక, పౌరాణిక,జానపద, సోషియో ఫాంటసీ, కామెడీ, హారర్ అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. కొన్ని ఐకానిక్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. సిల్వర్ స్క్రీన్ పై యముడు అంటే కైకాల సత్యనారాయణ గారే గుర్తొస్తారు. అలాంటి కైకాల మరణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కాగా సత్యనారాయణకు తీరని కోరిక ఒకటి ఉందట.

చిరంజీవి-బాలకృష్ణ మల్టీస్టారర్ చేయాలని, అందులో తాను నటించాలని అనుకున్నారట.అయితే ఆ కోరిక తీరలేదు. కొంతలో కొంత కైకాల కోరిక ఆర్ ఆర్ ఆర్ తో తీరిందట. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ కైకాలకు చాలా బాగా నచ్చిందట. చిరంజీవి-బాలయ్యలను ఒక మూవీలో చూసే ఆశ తీరకపోయినా… వారి వారసులు ఎన్టీఆర్-చరణ్ లు కలిసి నటించారని సంతోషపడ్డారట. కానీ తాను కోరుకున్న కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది.

follow us