రేపు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

రేపు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

కైకాల అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించబోతుంది. శనివారం మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించాలని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గొపినాథ్‌కు సూచించారు.

నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈరోజు శుక్రవారం (డిసెంబర్ 23) ఉదయం కన్నుమూశారు. ఎస్వీ రంగరావు తర్వాత ఆ స్థాయి అందుకున్న సత్యనారాయణ. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల, నాటకాల్లో రాణించి.. ఆ అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టారు.

నవరసాలను పండించే నటుడిగా, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించాడు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఆయన చేయని పాత్ర లేదు. సాంఘిక, పౌరాణిక,జానపద, సోషియో ఫాంటసీ, కామెడీ, హారర్ అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. కొన్ని ఐకానిక్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. సిల్వర్ స్క్రీన్ పై యముడు అంటే కైకాల సత్యనారాయణ గారే గుర్తొస్తారు. అలాంటి కైకాల మరణంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

follow us