తమిళనాట ఎన్నికల్లో పోటీకి సిద్ధమౌతున్న హీరోలు.!

Kamal Haasan and vishal ready for 2021 Tamil Nadu Assembly elections
Kamal Haasan and vishal ready for 2021 Tamil Nadu Assembly elections

తమిళ నటుడు విశాల్ వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. చెన్నై నగర పరిధిలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి విశాల్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై అభిమాన సంఘాలతో చర్చించిన తరవాత ఆయన నిర్ణయం తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది.

త్వరలో ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా గత ఎన్నికల్లో సైతం విశాల్ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీకి దిగిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు.

అయితే చివరి క్షణంలో నామినేషన్ ప్రతిపాదించిన పదిమందిలో ఒకరు మద్దతును ఉపసంహరించుకున్నారు. దాంతో ఆయన ఎన్నికల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి విశాల్ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈసారైనా విశాల్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా చూడాలి.

ఇక మరోవైపు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. కచ్చితంగా పోటీ చేస్తానని..నియోజక వర్గాన్ని తరవాత ప్రకటిస్తానని కమల్ పేర్కొన్నారు. ఇక తన పార్టీ మక్కల్ నీది మైనమ్ అనే పార్టీ తరుపునే ఆయన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.