ఫైర్ బ్రాండ్ కు కరోనా పాజిటివ్..!

కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటిలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సెలబ్రెటీ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ మేరకు కంగనా ఓ పోస్ట్ పెట్టింది. పోస్ట్ లో కొద్ది రోజులగా నీరసంగా అనిపిస్తుంది. అంతే కాకుండా కండ్లు కూడా మండుతున్నాయి. ఇక ప్రస్తుతం హిమాలయాలకు వెళ్లనుకున్నా అందుకోసం ముందు జాగ్రత్తగా టెస్ట్ కరోనా టెస్ట్ చేసుకున్నా.. శనివారం వచ్చిన రిపోర్ట్స్ లో పాజిటివ్ పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. కానీ వైరస్ నా శరీరం లోకి ఎలా ప్రవేశించిందో తెలియడం లేదు..కానీ ఇప్పుడు వైరస్ ను నాశనం చేయగలను. మీరు కూడా వైరస్ కు భయపడకండి…భయపడితే ఆ వైరస్ మరింత భయపెడుతోంది. అదో చిన్న ఫ్లూ తప్ప మరేమీ కాదు. రండి వైరస్ ను నాశనం చేద్దాం అంటూ కంగనా పోస్టులో పేర్కొంది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయాపిక్ లో నటించింది. అయితే కారోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. మరోవైపు కంగనా ఇటీవల బెంగాల్ అల్లర్ల ఘటనపై పలు పోస్టులు పెట్టడంతో ఆమె అకౌంట్ ను శాశ్వతంగా తొలగిస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది.