ఇంగ్లీష్ వెర్షన్ లో డబ్ కాబోతున్న కాంతారా

ఇంగ్లీష్ వెర్షన్ లో డబ్ కాబోతున్న కాంతారా

కాంతారా..కాంతారా..కాంతారా గత రెండు నెలలుగా ఈ పేరు దేశ వ్యాప్తంగానే కాదు వరల్డ్ వైడ్ గా కూడా మారుమోగిపోతుంది. కన్నడ భాషలో ఓ చిన్న సినిమాగా విడుదలై..ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదల అవ్వడమే కాదు గత చిత్రాల రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో భాషల్లో రిలీజ్ అవ్వగా..ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా డబ్ కాబోతుంది. ఇంగ్లీష్ వర్షన్ థియేటర్స్‌లో విడుదలకానుందా లేక ఓటీటీకే పరిమితం కానుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇక తెలుగు లో ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేయగా ..దాదాపు రూ. 60 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమా నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో సైతం భారీ వ్యూస్ రాబడుతూ అలరిస్తుంది. ముఖ్యముగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ఫిదా అవుతున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లామాక్స్ 20 నిముషాలు మరో ఎత్తు అని ప్రతి ఒక్కరు చెపుతున్నారు. కథ లో దమ్ము ఉంటె అందులో నటి నటులతో సంబంధం లేదని కాంతారా తో మరోసారి రుజువు అయ్యింది.

follow us