వీడియో : బ్రిడ్జ్‌పై నుంచి అదుపు తప్పి కింద పడిపోయిన కానిస్టేబుల్ 

కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారి పై ఆదివారం మానేరు వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోవడంతో ఒకరు మృతి చెందారు , మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వంతెన పై నుంచి కారును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నదిలో పడి మృతి చెందారు.