కేజీఎఫ్-2 తెలుగు రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న మేకర్స్..!

  • Written By: Last Updated:
కేజీఎఫ్-2 తెలుగు రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న మేకర్స్..!

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్. సినిమా విడుదలకు ముందు ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సినిమా అంటే తెలియని వాళ్ళు లేరు. అంతగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో విడుదలైన అన్ని భాషల్లో సినిమాగా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కేజీఎఫ్ 2 హక్కులకు మేకర్స్ రికార్డు స్థాయిలో డిమాండ్ చేస్తున్నారట. కేజీఎఫ్ సినిమా ఏపీ,తెలంగాణ హక్కులను కేవలం రూ. 5కోట్లకు అమ్మేసారు. కానీ ఆ సినిమాకు 12కోట్ల లాభాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏపీ,తెలంగాణాలో కేజీఎఫ్-2 రైట్స్ కోసం ఏకంగా రూ.60 కోట్లు డిమాండ్ చేస్తునట్టు సమాచారం. కేవలం ఒక్క గుంటూరులోనే రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.

ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు సినిమా పై ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో క్లైమాక్స్ కోసం ఏకంగా 12 కోట్లు ఖర్చు చేశారట. దాంతో సినిమాలో క్లైమాక్ హైలెట్ గా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో రాకీ బాయ్ (యష్) కి విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విరాజయం సాధిస్తుందో చూడాలి.

follow us