ఖుషి రీ రిలీజ్ ను అడ్డుకున్న ఏపీ సర్కార్

ఖుషి రీ రిలీజ్ ను అడ్డుకున్న ఏపీ సర్కార్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఏపీ సర్కార్ కు ఎంత భయమో మరోసారి బయటపడింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను అడ్డుకోవడం , ఆయన పర్యటనలను అడ్డుకోవడం, ఆయన ప్రసంగాలు ఫై విమర్శలు చేయడం అనేది జగన్ సర్కార్ కు కామన్ అయిపోయింది. ఇలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు డ్యామేజ్ అవుతుందని వారు భావిస్తుంటే..పవన్ కు మాత్రం అది మేలు జరుగుతుందని అంత భావిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా రిలీజ్ లకు అభ్యంతరాలు తెలిపిన జగన్ సర్కార్..తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి రీ రిలీజ్ విషయంలోనూ అదే చేసాడు.

పవన్ కళ్యాణ్ – భూమిక కలయికలో 2001 లో వచ్చిన ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను న్యూ ఇయర్ స్పెషల్ గా ఈరోజు నుండి జనవరి 06 వరకు థియేటర్స్ లో సందడి రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబదించిన అడ్వాన్స్ బుకింగ్ సైతం పూర్తి అయ్యాయి.

భీమవరం లో ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోస్ ని తెల్లవారుజామున 8 గంటల నుండి ప్రారంభించారు.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి.. టికెట్స్ అన్నీ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి..కానీ ఆ ప్రాంత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ స్పెషల్ షోస్ అన్నిటిని రద్దు చేయించాడట..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. స్పెషల్ షోస్ మీద కూడా ఇలాంటి కక్ష సాధిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ అంటే జగన్ సర్కార్ కు ఎంత భయమో అని అభిమానులు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వాడేసుకుంటున్నారు. భీమవరం లో ఇలాంటి చర్యలు గతం లో చాలానే జరిపించాడు గ్రంథి శ్రీనివాస్..ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే..ఆ గొడవలు జరగడానికి కారణం కూడా గ్రంథి శ్రీనివాస్ అని అందరూ అంటూ ఉంటారు.ఇప్పుడు మరోసారి పవన్ పై గ్రంథి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. కానీ ఇది ఆయనకే పెద్ద దెబ్బ అని తెలియడం లేదని ఆ ప్రాంత వాసులు మాట్లాడుకుంటున్నారు.

follow us