ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన కియారా అద్వానీ..

ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన కియారా అద్వానీ..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైందా..అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గత కొద్దీ రోజులుగా సిద్దార్థ్ మల్హోత్రా తో కియారా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరు తమ వివాహాన్ని డిసెంబర్ లో కాకుండా ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఫిబ్రవరి 6న కియారాను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నాడని ,రాజస్థాన్ లో గల జైసల్మేర్ ప్యాలెస్ ఈ వివాహానికి వేదిక కానుందని , 4,5 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయని అంటున్నారు. 3వ తేదీన సెక్యూరిటీ సిబ్బంది జైసల్మేర్ ప్యాలెస్ కి వెళ్లి కావలసిన ఏర్పాట్లు చేయనున్నారట. మరి ఇది ఎంత వరకు నిజం అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ప్రస్తుతం కియారా తెలుగు లో రామ్ చరణ్ సరసన పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది.

follow us