కింగ్ కోఠి ప్యాలెస్ నే ఇలా అమ్మేశాడు !

  • Written By: Last Updated:
కింగ్ కోఠి ప్యాలెస్ నే ఇలా అమ్మేశాడు !

ముంబై కి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ లో పని చేసే ఏజెంట్ ఏకంగా 300 కోట్లకి కింగ్ కోఠి నే అమ్మేశాడు.. ఇలా అమ్మేసిన ప్రభుద్దిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు.. 

అధికారులు నిందితుడిని హైదరాబాదుకు చెందిన సుందరం కోల్రుకుంద్రో రవీంద్రన్ (64)గా గుర్తించారు. ఆర్థిక నేరాల విభాగం 9వ యూనిట్ అధికారులు అతన్ని శుక్రవారంనాడు అరెస్టు చేశారు. మోసం, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర వంటి సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు.

ఈ ఫ్రాడ్ బయటపడగానే నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుకవుట్ నోటీసులు జారీ చేశారు అని ఆసియానెట్ లో తెలిపారు. 

భారతదేశంలో విలీనం కాక ముందు ఆ ప్యాలెస్ చివరి హైదరాబాదు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారిక నివాసంగా  ఉండేది. అనారోగ్యంతో నిజాం 1967 మరణించారు. ప్రస్తుతం ప్యాలెస్ ప్రధాన భవనంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రి నడుస్తోంది. …

Tags

follow us

Web Stories