ఎన్టీఆర్ కొరటాల కాంబో: ఫ్యాన్స్ ఫుల్ కుషీ

  • Written By: Last Updated:
ఎన్టీఆర్ కొరటాల కాంబో:  ఫ్యాన్స్ ఫుల్ కుషీ

ప్ర‌స్తుతం స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లో కొర‌టాల శివ ఒక‌రు. కొర‌టాల ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. మూడేళ్ల నుండి కొర‌టాల ఈ సినిమా కోస‌మే ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొర‌టాల అల్లు అర్జున్ తో ఓ సినిమాను స్టార్ట్ చేస్తారు. ఆలోపు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా కొర‌టాల అస‌లు గ్యాప్ తీసుకోకుండా త‌న నెక్స్ట్ సినిమాను ప్ర‌రంభించాల‌నే ప్లాన్ లో ఉన్న‌ర‌ట‌.

ఇదిలా ఉండ‌గానే కొర‌టాల ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ కు కొర‌టాల క‌థ‌ను కూడా వినిపించిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాను మ‌రికొన్ని వారాల్లోనే ఫైన‌లైజ్ చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ న‌డుస్తోంది. సినిమా క‌న్ఫామ్ అయితే గ‌న‌క ఎన్టీఆర్ ప్ర‌స్తుతం తాను సైన్ చేసిన సినిమాలు పూర్తి చేసుకుని కొర‌టాల సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంది. ఇక ఇప్ప‌టికే కొర‌టాల ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాను తెర‌కెక్కించారు. దాంతో ఈ సినిమా మ‌రో సూప‌ర్ హిట్ గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ ఫుల్ కుషీ అవుతున్నారు.

follow us