కొర‌టాలకు ‘ఆచార్య‌’ రియ‌ల్ కథ కలిసొస్తుందా ?

  • Written By: Last Updated:
కొర‌టాలకు ‘ఆచార్య‌’ రియ‌ల్ కథ కలిసొస్తుందా ?

దర్శకుడు కొర‌టాల శివ‌ సామాజిక అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చే వైవిధ్యమైన దర్శకుల్లో ఒకరు. ‘మిర్చి’ నుంచి ‘భ‌ర‌త్ అనే నేను’ వ‌ర‌కూ కొర‌టాల రూటే అది. అయితే.. తాను ఎలాంటి పాయింట్ ఎంచుకున్నా.. అది కొరటాల క‌ల్ప‌న‌లోంచి వ‌చ్చిన‌దే. అయితే తొలిసారిగా ఆయన ‘ఆచార్య‌’ కోసం రియ‌ల్ స్టోరీని ఎంచుకున్నాడ‌ట‌. చిరంజీవి – కొరటాల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య‌’. ఇందులో రామ్ చ‌ర‌ణ్ సైతం ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాడు. కాజ‌ల్ క‌థానాయిక‌. దేవాద‌య భూములు, న‌క్స‌లిజం నేప‌థ్యంలో సాగే క‌థ ఇదేనని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురిలో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ క‌థ‌ని రాసుకున్నాడ‌ట కొర‌టాల‌. అక్క‌డ దేవాద‌య భూముల్ని కొంత‌మంది అక్ర‌మార్కులు లాగేసుకున్న వైనం ఈ క‌థ‌కు మూలం అని తెలుస్తోంది. దానికి చిరంజీవి స్టైల్ ఆఫ్ సీన్లు జోడించాడ‌ట‌. రామ్ చ‌ర‌ణ్ పాత్ర నేప‌థ్యానికి కూడా ధ‌ర్మపురి సంఘ‌ట‌న‌ల‌నే మూల‌మ‌ని తెలుస్తోంది. ఈ యేడాది వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

follow us