ఆచార్య: కొరటాల శివ కి ఇది ఒక అగ్ని పరీక్ష..

ఆచార్య ఈ సినిమా కోసం కొరటాల శివ కొన్ని ఏళ్ళ గా ఎదురు చూస్తున్నాడు, కానీ చిరంజీవి సైరా తర్వాత బ్రేక్ తరువాత కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ , ఆ తరువాత టైం అంతా కరోనా వైరస్ తో ఇలా బ్రేకులు పడుతూనే ఉన్నాయి , ఇప్పుడు మరో సరి కొత్త సమస్య వచ్చింది.. 

భరత్ అనే నేను సినిమా 2018లో విడుదల అయిన తరువాత కొరటాల శివ కేవలం ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. ఒక శిల్పి శిల్పాలను చెక్కినట్టు చెక్కుతున్నాడు ఇంచు మించు.. 

అంత ఎదురు చూస్తూ కొరటాల శివ లో ఓపిక చచ్చిపోయిందని వినికిడి.. ఇప్పుడు రామ్ చరణ్ RRR షూటింగ్ ముగించడం కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.. ఇవి అన్ని కలిపి కొరటాల లో అసహనం పెరిగిపోయింది.. 

చిరంజీవి తో సినిమా అంటే వెయిట్ చెయ్యాలి .. కానీ మరి ఇంత సమయమా??… 

చిరు అప్పుడేప్పుడో స్టేజి మీద నాకు మీరు ( కొరటాల శివ ) సినిమా 100 రోజుల్లో  పూర్తి చెయ్యాలని కొరటాల దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు.. కానీ షూటింగ్ కు ముఖ్య నటీనటులే అందుబాటులో లేక పోతే దర్శకుడి ఓపికకు ఇది అగ్ని పరీక్షే కదా..