ఖుషి లో కృతి శెట్టి..?

ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కి బంపర్ ఆఫర్ తగిలినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ఉప్పెన, బంగార్రాజు , శ్యామ్ సింగ్ రాయ్ వంటి వరుస హిట్లు అందుకున్న ఈ బ్యూటీ..ఆ తర్వాత వరుస ప్లాప్స్ అందుకుంది వారియర్ , మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలతో ప్లాప్స్ అందుకుంది. ఈ క్రమంలో అమ్మడికి విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ కలయిక లో ఖుషి పేరుతో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తాలూకా షూటింగ్ ఇప్పటికే మొదలై , పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురి కావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ మూవీ లో హీరోయిన్ కృతి శెట్టి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కి ఛాన్స్ ఉందని.. ఈ మేరకు కృతి శెట్టిని సెలెక్ట్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో కీలకమైన ఆమె పాత్ర తొలుత నెగటివ్ షేడ్‌లో ఉండి.. ఆ తర్వాత క్లైమాక్స్‌లో పాజిటివ్‌గా ముగియబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో జయరామ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, సచిన్ ఖాదేకర్ తదితరులు నటిస్తున్నారు.