టాలీవుడ్ కి హీరోయిన్ ల కొరత

  • Written By: Last Updated:
టాలీవుడ్ కి హీరోయిన్ ల కొరత

టాలీవుడ్ లో చాలానే సినిమాలు వస్తుంటాయి.. కొత్త అమ్మాయిలకి అవకాశాలు ఉంటాయి, ఇది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అడుగు పెడితే ఇంకా అన్ని జయించినట్టే అని అనుకునే అమ్మాయిలు చాలానే ఉంటారు.. గోవా నుంచి అటు ముంబై నుంచి అందరూ అందం అయినా బామలు మన ఇండస్ట్రీ లోకి వచ్చి పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు అలాంటి ఇండస్ట్రీ కి హీరోయిన్లు కరువు అయ్యారు..

సీనియర్ హీరోయిన్లు ఇప్పటికే సినిమాలు తగ్గించేశారు.. హై బడ్జెట్ సినిమాలో మాత్రమే కనిపిస్తున్నారు.. కథ, హీరో, ప్రొడ్యూసర్ , దర్శకుడు ఇలా అన్ని ముఖ్యమే అంటున్నారు.. తమన్నా, నయనతార, సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోయిన్లు వీళ్ళే , దీనిలో ఇప్పటికే సమంత అక్కినేని పెళ్లి చేసుకుంది సినిమాలు ఒప్పుకోవడం లేదు. తమన్నా కి చేతులో చెప్పుకోడానికి పెద్ధ సినిమాలు లేవు, నయనతార ఎకంగా 8 కోట్లు లేనిదే సినిమా చెయ్యను అంటుంది.. కాజల్ అగర్వాల్ ఇప్పుడే బరువు తగ్గి కుర్ర హీరో లతో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టింది.. 

ఇప్పుడు టాలీవుడ్ లో చెప్పుకోవడానికి కొంత మందే మిగిలారు.. పూజ హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నా తప్ప పేరు చెప్పుకోవడానికి హీరోయిన్లు కరువు అయ్యారు… ఇంకా పూజ హెగ్డే ఈ కన్నడిగా బాలీవుడ్ లో ఇప్పటికే అరంగేట్రం కూడా చేసేసింది.. పెద్ద హిట్ రాకపోయినా కానీ మంచి అవకాశాలు చేజిచుకుంటుంది .. ఇలానే కొన్ని రోజులు సాగితే ఈ అమ్మడు కూడా టాలీవుడ్ లో సినిమాలు తగ్గించేస్తుంది.. రష్మిక మందన్న ఈమె కూడా కన్నడ అమ్మాయి కానీ తెలుగు ప్రేక్షకులని తన అల్లరి తో బాగానే అక్కట్టుకుంది.. రాశి ఖన్నా కి చెప్పుకునే హిట్టు లేదు.. బరువు తగ్గింది , కొత్త లుక్ లో కనిపిస్తుంది అయినా కానీ ఈమె కి చెప్పుకోడానికి హిట్ లేదు.. 

RRR సినిమా కి కూడా బాలీవుడ్ భామని తీసుకు వచ్చారు.. మహేష్ బాబు సినిమాలకి కూడా  కియారా అద్వానీ లాంటి వాళ్ళను తీసుకువస్తున్నారు .. ఇలా అమ్మాయిలు తక్కువ అయ్యి బాలీవుడ్ వైపు చూస్తున్నారు మన హీరోలు నిర్మాతలు.. 

హీరోలు ఒక్కో కుటుంబం నుంచే గుంపులు గుంపులు గా వస్తున్నారు సినిమాలు తీస్తున్నారు.. అందరూ మనం పైన చెప్పుకున్న హీరోయిన్ల కోసమే వెతుకున్నారు.. టాలీవుడ్ కి అర్జెంటు గా హీరోయిన్ లు కావాలి.. 

follow us

Web Stories