చిరంజీవికి ఫోన్ చేశా, ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ చేయడానికి .. !

ఉదయ్ కిరణ్, 2000 సంవత్సరంలో తన కెరీర్ స్టార్ట్ చేసీ హ్యాట్రిక్ హిట్ల తో ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకొనేలా చేశాడు , కారణాలు తెలియవు గాని ఉదయ్ కిరణ్ కెరీర్ 2004 తో పూర్తిగా పడిపోయింది. వచ్చిన అవకాశాలు నిలబడటంలేదు , కొత్త అవకాశాలు రావడంలేదు . చిరంజీవి కూతురు నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాక ఎన్నో సినిమాలు ఉదయ్ కిరణ్ నుండి జారిపోయాయని అప్పట్లో గుసగుసలు .
10 సంవత్సరాలు ఇండస్ట్రీలో కెరీర్ నిలబెట్టుకోవడానికి ఏంతో ప్రయత్నించి విఫలమై 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉదయ్ కిరణ్ మరణంతో చిరంజీవి కి సంబంధం ఉందని ఎన్నో రుమర్స్ వచ్చాయి , అయితే ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి, దీనికి చిరంజీవి కి సంబంధంలేదని నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాక కూడా చిరంజీవి ఇంటికి వెళ్ళాడని చిరంజీవిగారిని కలిసి వచ్చాడని చెప్పారు .
అయితే లగటిపాటి శ్రీధర్ ఒక ఇంటర్వ్యూ లో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ వియ్యాలవారి కయ్యాలు సినిమా రిలీజ్ చేయడానికి చిరంజీవికి ఫోన్ చేసానని విడుదల చేస్తే ఏమైనా ఇబ్బందా అని అడిగాను, కానీ చిరంజీవి గారు మీ సినిమా మీ ఇష్టం అని అల్ ది బెస్ట్ కూడా చెప్పారని నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పారు, అంటే చిరంజీవి ఉదయ్ కిరణ్ పట్టించుకోలేదు. చివరగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఎవరికి తెలియకుండా మిగిలిపోయాయి .