ఎన్టీఆర్ కొరటాల సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

ప్రస్తుతం ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా…ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్ తరవాత సినిమాపై క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తరవాత సినిమా ఉండబోతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.
అయితే తాజాగా ఈ సినిమా పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వారిలో ఒకరు బాలివుడ్ స్టార్ హీరోయిన్ అన్నట్టు గా టాక్ వినిపిస్తోంది. ఇక పేర్లు మాత్రం రివీల్ అవ్వలేదు కానీ కొరటాల మాత్రం ఎన్టీఆర్ కు హీరోయిన్ లను సెట్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ తో జోడీ కట్టబోయే ముద్దు గుమ్మలు ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.