లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం..

తేజ కొత్త చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్

ఇటీవల చిత్రంలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే మంగళవారం కథానాయిక లావణ్యత్రిపాఠి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో హ్యాపీ 340గా లావణ్య కనిపించబోతుంది. ఆమె పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా, పూర్తి వినోదాత్మకంగా వుండబోతుందని చిత్ర బృందం తెలిపింది

follow us