నా జీవితంలో నేను ఎన్నోఎదుర్కొన్నా:ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ భార్య పాత్రలో నటించి మెప్పించిది.. డి గ్లామర్ గా ఉన్న అమ్మాయి లకు కూడా సినిమాలో ఆఫర్స్ వస్తాయని నిరూపించింది. తాజాగా ఐశ్వర్య తన జీవితం లో తను ఎదురుకున్న కష్టాలు, అవమానాలు ఫ్యామిలి ప్రాబ్లమ్స్ గురుంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.
నేను చాలా మధ్య తరగతి కుటుంబంనకు చెందిన అమ్మాయిని. మేము స్లమ్ ఏరియాలో నివసించేవాళ్లం. నాకు ఎనిమిది ఏండ్ల వయసులో మా నాన్న చనిపోయారు. ఈ సమాజంలో నాన్న లేని కుటుంబం ను ఎలా చూస్తారో మీ అందరికి బాగా తెలుసు. మేము మొత్తం ముగ్గురం. మా పెద్ద అన్న ఓ అమ్మాయి ని లవ్ చేసి, ప్రేమ విఫలం అయ్యి చనిపోయాడు. ఇంకో చిన్న అన్న రోడ్ ఆక్సిడెంట్ లో మరణించాడు. అటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది అలాంటి సమయంలో ఓ మధ్య తరగతి అమ్మాయి కుటుంబం ను పోషించాలంటే చాలా కష్టం. కానీ వాటినన్నింటిని ఎదురించి, ఓ చిన్న జాబ్ లాంటిది చెయ్యడం స్టార్ట్ చేశాను.
మొదట చిన్న చిన్న ఈవెంట్స్ చేసినా.., బర్త్ డే పార్టీ , ఫ్యామిలి ఫంక్షన్స్ కి ఈవెంట్ ఆర్గనైజర్ గా స్టార్ట్ చేసిన అప్పుడు నా జీతం నెలకు ఇదువేలు అలా ఇచ్చేవారు. ఆ డబ్బు తో కుటుంబాని పోషిస్తూ వచ్చాను. ఆ తరువాత సినిమాలో అవకాశాల కోసం చాలా మంది డైరెక్టర్స్ ను ప్రొడ్యూసర్స్ ను కలిసిన అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బతిలాడిన రోజులు ఉన్నాయి. నువ్వు డి గ్లామర్ గా ఉన్నావు అంటూ అవకాశాలు ఇవ్వలేదు. హీరో పక్కన నటించే అవకాశం కాకుండా. లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో అవకాశం కోసం చాలా ట్రై చేశాను. ఆ తరువాత వచ్చిన సినిమా అవకాశం తో ఇప్పటి వరకు నలబై పైగా సినిమాలో నటించాను. ఉత్తమ నటిగా 20 అవార్డ్స్ వరకు దక్కించుకుంది.