బాలీవుడ్ నటుడు చుంకీ పాండే వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనన్య పాండే. ఇప్పటివరకు తక్కువ సినిమాలే చేసినప్పటికీ అనన్య క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆ క్రేజ్ మొత్తానికి కారణం ఈ అమ్మడు సోషల్ మీడియాలో వడ్డించే వయ్యారాలే కారణం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ షేర్ చేసే పోస్టులకు లైకుల వర్షం కురుస్తోంది. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు మరిన్ని అందాలను కుర్రకారుకు ఎరవేస్తూ క్రేజ్ ను సంపాదించుకుంటుంది.
ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రస్తుతం రౌడీ సినిమా “లైగర్”లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరవుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతోంది. ఇక షూటింగ్ లో భాగంగా సందడి చేసిన ఫోటోలను కూడా చిత్ర యూనిట్ షేర్ చేయగా అనన్య లుక్ కు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక లైగర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. కాబట్టి లైగర్ బ్యూటీకి అన్ని భాషల్లో ఫ్యాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ఇప్పటినుండే అమ్మడు ఇలా కుర్రకారుకు వల వేస్తుందేమో.