విజయ్ “లైగర్” లా వచ్చేసాడు..!

  • Written By: Last Updated:
విజయ్ “లైగర్” లా  వచ్చేసాడు..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినట్టు సమాచారం. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను పూరి కనెక్ట్స బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ నిన్న (శనివారం )ప్రకటించింది. కాగా చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 10 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ ను , టైటిల్ ను అనౌన్స్ చేసారు. “లైగర్” పేరుతో టైటిల్ ను ప్రకటించారు. ఆడ పులి మగ సింహానికి పుట్టిన జంతువుని లైగర్ అని పిలుస్తారు. ఇక పోస్టర్ లో విజయ్ ఫస్ట్ లుక్ చూస్తే టైటిల్ కు తగినట్టుగా గర్జిస్తున్నాడు. సినిమాలో బాక్సర్ గా కనిపించనున్న విజయ్ ఫస్ట్ లో బాక్సింగ్ గ్లౌస్ లు తొడుక్కుని యుద్దానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

follow us