ఎర్రగడ్డ ఆసుపత్రికి తగ్గిన లిక్కర్ బాధితులు

కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ వల్ల  సరిహద్దు రాష్ట్రాల బోర్డర్స్ కూడా మూసివేశారు. నిత్యావసర వస్తువులు తప్పా ఏమి మార్కెట్ లో లేని పరిస్థితి, దీనితో  లిక్కర్ దొరకక పోవడం వల్ల , లిక్కర్ కు అలవాటు పాడిన వారు పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారు. ఇంకా తెలంగాణ లో ఈ సంస్కృతి  ఎక్కవ దీనితో కొందరు మానసికంగా దెబ్బతిని రోడ్ల  మీద, ఇంట్లోను ప్రవర్తన శైలి మారడం తో చేసేది ఏం లేక గత కొన్ని రోజులు గా ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తాకిడి ఎక్కువ అయ్యింది. 

తాజా రిపోర్ట్ ప్రకారం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ బాధితులు తగ్గారు. గత వారం రోజులుగా 800 లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ బాధితులు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి వచ్చారు. వారి మానసిక స్థితి కుదుటపడడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ఇంకా 150 మందికి ఈ సమస్య తీవ్రంగా ఉండడంతో ఇన్ పేషెంట్ లుగా అడ్మిట్ చేసుకున్నారు. 

లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ బాధితులకు ఇతర సమస్యలు ఉంటే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

ఇకపై లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ బాధితులు సంఖ్య తగ్గే అవకాశం ఉందని  అధికారులు   భావిస్తున్నారు.