లవ్ స్టోరీ ట్రైల‌ర్, ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్స్ ఫిక్స్..!

love story pre release event date locked
love story pre release event date locked

ప్ర‌స్తుతం తెలుగు ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ సినిమాల లిస్ట్ లో ల‌వ్ స్టోరీ ఒక‌టి. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన సాంగ్స్ మ‌రియు టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట‌కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్ లో సాయిప‌ల్ల‌వి స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఈ పాట యూట్యూబ్ లో సెన్సేష‌నల్ అవుతోంది. ఇప్ప‌టికే ఆదిత్య మ్యూజిక్ లోని టాప్ వ్యూవ్స్ వచ్చిన సాంగ్స్ లిస్ట్ లో సారంగ‌ద‌రియా చేరిపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు.

అయితే ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ ఎప్రిల్ 8న విడుద‌ల‌ చేయ‌బోతున్నట్టు తెలుస్తోంది. కాగా దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అంతే కాకుండా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఎప్రిల్ 13న జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా నాగ‌చైత‌న్య సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని తెలంగాణ బ్యాగ్డ్రాప్ లో తెర‌కెక్కించారు. సినిమాలో నాగ చైత‌న్య తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. దాంతో ఆ సినిమా పై భారీ అంచనాలున్నాయి.