తమిళ్ డైరక్టర్ చేతిలోకి ‘లూసిఫర్’ రీమేక్ ??

  • Written By: Last Updated:
తమిళ్ డైరక్టర్ చేతిలోకి ‘లూసిఫర్’ రీమేక్ ??

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత అన్నయ్య చేయబోయే ప్రాజెక్టు గురుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి. చిరంజీవి చేతిలో ఇప్పుడు రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన “లూసిఫర్”, మరోటి తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన “వేదాలమ్” చిత్రం. ప్రస్తుతం మాత్రం లూసిఫర్ రీమేక్ గురుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

“సాహో” చిత్రంతో మంచి దర్శకుడి గా గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ కు మొదటగా ఆ సినిమా రీమేక్ బాద్యతలు అప్పగించాలని చిరంజీవి అనుకున్నాడు. కానీ కారణాల వలన సుజిత్ ను తప్పించి వి‌.వి. వినాయక్ కు అప్పగించాడు. విజయ్ నటించిన “కత్తి” సినిమా ను చిరంజీవి తో “ఖైదీ నెంబర్ 150” గా రీమేక్ చేశాడు. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. మరల “లూసిఫర్” రీమేక్ బాద్యతలు వినాయక్ కు అప్పగిస్తే సరైన న్యాయం చెయ్యగలడు అనుకున్న మెగాస్టార్ వినాయక్ పేరును తెరపైకి తెచ్చాడు. “లూసిఫర్” ను వినాయక్ డైరక్షన్ లో చిరంజీవి చెయ్యబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఈ బాధ్యతలను తమిళ్ దర్శకుడు మోహన్ రాజా కు అప్పగిస్తున్నట్లుగా మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

మోహన్ రాజా తమిళంలో ‘తనివరువన్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. పలు తెలుగు సినిమాలను తమిళ్ లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే మోహన్ తో చిరంజీవి చర్చలు జరిగాయని మెగాస్టార్ టీమ్ తో కలిసి కథలో మార్పులు చేస్తున్నట్లుగా సమాచారం. లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని రామ్ చరణ్, ఏన్వి ప్రసాద్ లు కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై నిర్మించనున్నారు.

follow us