ఎల్వీ ఊస్టింగ్ వెనుక క్రిస్టియన్ లాబీ..!?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ తొలగింపు వ్యవహారం వెనుక క్రిస్టియన్ లాబీ ఉందా..? ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం.. సీఎస్ ఎల్వీ తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి కంటగింపుగా మారడం వల్లే గెంటివేతకు గురయ్యారా..? ఆలయాల్లో అన్యమతస్తులను… తొలగించేందుకు సీఎస్ ఉద్ధృతంగా చేసిన చర్యలు ఆయనపై జగన్‌ శీతకన్ను వేయడానికి కారణమయ్యాయా..? అవుననే అంటున్నారు..  గత ఐదు నెలల పాలనను.. దగ్గరగా చూసిన మాజీ బ్యూరోక్రాట్లు…. వైసీపీ పెద్దలతో సన్నిహితంగా మెలిగిన అధికారులు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ విషయంలో… తన అభిప్రాయాలను ఏ మాత్రం దాచుకోవడం లేదు. ట్వీట్ల ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని నేరుగానే చెప్పేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఇటీవలి కాలంలో  హిందూ అంశాలకు సంబంధించి ఏపీ సర్కార్ పెద్దలతో కాస్త విబేధిస్తున్నట్లుగా చెబుతున్నారు. 

కొద్ది రోజుల కిందట.. తిరుమల ఆర్టీసీ బస్సుల్లో జెరూసలెం యాత్ర టిక్కెట్లు కనిపించినప్పటి నుండి.. ఆయన…ఇలాంటి సున్నితమైన విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ల వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇళ్ల స్థలాల పంపిణీ కోసం.. ఆలయాల భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని… జగన్మోహన్ రెడ్డి సర్కార్ భావించింది. అయితే.. ఈ ప్రయత్నాలను సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. అడ్డుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో.. ఆలయాల్లో ఉన్న అన్యమతస్తులను ఏరివేసేందుకు.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అనుమానితులుగా ఉన్న ఉద్యోగుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. 

వారు అన్యమతస్తులుగా తేలితే చర్యలు తీసుకున్నారు. దీనిపై .. కొన్ని క్రిస్టియన్ సంఘాలు .. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై నిరసన కూడా వ్యక్తం చేశాయి. ఆయనపై కోర్టుకు వెళ్తామని హెచ్చరికలు కూడా పంపాయి. ఈ క్రమంలో.. ఎల్వీకి.. జగన్ కు మధ్య దూరం పెరిగినట్లుగా చెబుతున్నారు. క్రిస్టియన్ లాబీ ఒత్తిడి ఎక్కువ కావడంతో.. ఎల్వీని జగన్ ఇక భరించలేకపోయినట్లు.. ఐవైఆర్ లాంటి వాళ్ల ట్వీట్ల ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇంత చేసి.. ఎల్వీకి ఉన్న పదవి కాలం… ఆరు నెలలు లోపు మాత్రమే.

Source : telugu360