కొద్ది నిమిషాల్లో పెళ్లి.. 100 కు ఫోన్ చేసిన వధువు

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన యువతికి, మరిపెడ మండలం గుండెపుడి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. కాగా, పెళ్లి సామగ్రి కొనుగోలు సమయంలోనే వరుడు నచ్చలేదని, పెళ్లి చేసుకోనని తేల్చి యువతి తల్లిదండ్రులకు చెప్పినా బలవంతంగా ఒప్పించారు.
గురువారం మరిపెడలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ముహూర్తం ఉండగా వధువు డయల్ 100కు ఫోన్ చేసింది. వధూవరులు పీటల మీద కూర్చునే సమయానికి పోలీసులు మండపానికి చేరుకున్నారు. యువతిని స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె ఎంతకీ ఒప్పుకోలేదు. దీంతో బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. చివరికి పెళ్లి జరగకుండానే బంధువులు అక్కడి నుండి విరమించుకున్నారు.