గుణశేఖర్ కుమార్తె రిసెప్షన్‌లో సందడి చేసిన మహేష్ – బన్నీ

గుణశేఖర్ కుమార్తె రిసెప్షన్‌లో సందడి చేసిన మహేష్ – బన్నీ

డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె నీలిమ వివాహ రిసెప్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ రిసెప్షన్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నీలిమ-రవి దంపతులను ఆశీర్వదించారు. స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌, రాజశేఖర్‌ దంపతులు, దర్శకుడు రాజమౌళి దంపతులు, కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నీలిమ గుణ వివాహం వ్యాపారవేత్త రవి ప్రక్యాతో డిసెంబర్‌ 3వ తేదీ (శనివారం) అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కుటుంబ సభ్యుల సమసక్షంలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నీలిమ గుణ ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

follow us

Related News