హాలీవుడ్ ‘టేనేట్’ తో మహేష్ AMB రీ ఓపెన్ !

హాలీవుడ్ ‘టేనేట్’ తో మహేష్ AMB రీ ఓపెన్ !

కరోనా కారణంగ, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో సినిమా హల్స్, మల్టీఫ్లేక్స్ లు మూతపడ్డాయి. ఈ మధ్య కాలంలో కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో థియేటర్స్ ముస్తాబు అవ్వుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, ఏషియన్ సునీల సంయుక్తంగా నిర్మించిన థియేటర్ ఏ‌ఎం‌బి మల్టీఫ్లేక్స్. డిసెంబర్ 4 నుండి తలుపులు తెరుచుకొనున్నది. వచ్చే నెలలో టాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టేనేట్. ఇండియాలో ఈ సినిమా తెలుగు. హింది, ఇంగ్లిష్ బాషల్లో విడుదల అవ్వుతుంది.

ఏ‌ఎం‌బి సినిమాస్ లో టేనేట్ డిసెంబర్ 4 న హింది వెర్షన్ లో విడుదలవుతుంది. ఇనాక్స్, పి‌వి‌ఆర్, సినిపోలిస్ వంటి మల్టీఫ్లేక్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడుతుంది. సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సొ బెటర్” సినిమా డిసెంబర్ 25 న విడుదలవుతుంది. కరోనా కారణంగ చాలా వరకు సినిమాలు ఓటిటీ పై విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ డిసెంబర్ 11 నుండి పూర్తి స్థాయిలో తెరుచుకొన్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తు సిటింగ్ ఉండనున్నదని సమాచారం.

follow us