న్యూ ఇయర్ సందర్బంగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు

న్యూ ఇయర్ సందర్బంగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెరపై చాలామంది హీరో అనిపించుకుంటారు. కానీ తెరవెనుక రియల్ హీరో అనిపించుకునే వారు కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయిలు తీసుకునే మహేష్..కేవలం సినిమాలతోనే కాకుండా వాణిజ్య ప్రకటనలు , పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంటారు. ఆలా తీసుకున్న డబ్బును దాదాపు 50 % సమాజానికి ఉపయోగిస్తుంటారు.

పసిపిల్లలకు ప్రాణ దానం చేస్తూ కనిపించే దేవుడయ్యాడు. కొన్ని ఏళ్లుగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఈ విషయం చాలా కాలం గోప్యంగా ఉండి పోయింది. పబ్లిసిటీ ఇష్టపడని మహేష్ తన ఫౌండేషన్ ద్వారా హార్ట్ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం చేయిస్తున్నాడు. దీని కోసం ప్రముఖ ఆసుపత్రులతో ఆయన చేయి కలిపారు. ఇప్పటి వరకు వందల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఆ తల్లిదండ్రుల్లో..ఆ చిన్నారుల్లో ఆనందం నింపారు. ఇక ఇప్పుడు మరో ముందు అడుగువేశాడు.

ఈ సేవలు మరింతగా విస్తరించేందుకు మహేష్ అధికారిక వెబ్ సైట్ ను న్యూ ఇయర్ సందర్బంగా ప్రారంభించారు. maheshbabufoundation.org పేరుతో ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తన ముద్దుల తనయ సితార.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాన్న మహేష్ సామాజిక సేవలో తాను కూడా భాగం అవుతానన్న సితార ఈ నెల పాకెట్ మనీ మహేష్ బాబు ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆసక్తి ఉన్నవారు తమ వంతు సహాయం చేయవచ్చని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి అభిమానులు , సినిమా ప్రముఖులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తమ సాయాన్ని అందిస్తామని చెపుతున్నారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 30 వ సినిమా చేయబోతున్నాడు. నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

follow us