మరో మాస్ మసాలా సినిమా లో మహేష్ బాబు 

Mahesh Babu in F3
Mahesh Babu in F3

వరుస హిట్లతో మంచి జోరు మీదున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా అనీల్ కెరియర్లో మైలు రాయిగా నిలిచింది. అయితే ఇప్పుడుఈ సినిమా హడావిడి పూర్తయింది. మహేష్ తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అటు అనీల్ కూడా ‘ఎఫ్3’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

అయితే ‘ఎఫ్3’  సంబందించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్2’ సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న అనీల్.. ఈ మాస్ సినిమా లో మహేష్ బాబు కనిపించే ఛాన్స్ కనిపిస్తుంది..

ఈ సారి ముగ్గురు హీరోలతో సినిమా చేస్తాను అని అనౌన్స్ చేసాడు. వెంకటేష్, వరుణ్, రవితేజాలతో సినిమా చేయాలని మొదట్లో అనుకున్నాడు అనీల్..  కానీ ఇప్పుడు మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. రవితేజ ప్లేస్ లో మహేష్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి  ఉంది. మహేష్, మాస్ రాజా ప్లేస్ ను రీప్లేస్ చేస్తాడా లేక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడా అన్నది చూడాలి.