పర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా..సెల్ఫ్ ఐసోలేషన్ కు మహేష్ బాబు..!

టాలీవుడ్ పై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు టెక్నీషియన్స్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అంతే కాకుండా మరికొందరు నటీనటులు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళుతున్నారు. తన హెయిర్ స్టైలిష్ కు కరోనా రావడం తో ప్రభాస్ ఇప్పటికే ఐసోలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కరోనా బారిన పడ్డారు. దాంతో అతడిని కాంటాక్ట్ అయ్యిన మహేష్ బాబు ఐసోలేషన్ లోకి వెళ్లారు.
పర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా..సెల్ఫ్ ఐసోలేషన్ కు మహేష్ బాబు..!అంతే కాకుండా మహేష్ నటిస్తున్న సర్కారువారిపాట సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. మహేష్ బాబు స్టైలిస్ట్ మాత్రమే కాకుండా సర్కారు వారి టీమ్ లో మరో నలుగురు టెక్నీషియన్స్ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది. నైట్ కర్ఫ్యూ వల్ల మాత్రమే షూటింగ్ ను వాయిదా వేసుకున్నామని చెబుతోంది. ఇక పరిస్ధితులు మెరుగైతే సర్కారువారిపాట సినిమా షూటింగ్ తిరిగి మే లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.