ఫుడ్ బిజినెస్ లోకి మహేష్ బాబు..గ్రాండ్ గా ప్రారంభం

ఫుడ్ బిజినెస్ లోకి మహేష్ బాబు..గ్రాండ్ గా ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే పలు బిజినెస్ లు మొదలుపెట్టి సక్సెస్ అవ్వగా..ఇప్పుడు తన భార్య నమ్రత పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసారు. ఏసియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్‌ చైన్ మొదలుపెట్టిన మహేష్.. తాజాగా అదే గ్రూప్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను గురువారం నాడు ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్‌కు ‘ఏఎన్’ అని నామకరణం చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత. AN రెస్టారెంట్స్ పేరుతో హైదరాబాద్‌లో మినార్వా కాఫీ హైట్స్ ఆఫ్ ప్లేసెస్ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టారు. బుధవారం నాడు నమ్రత, ఎషియన్ సునీల్ సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి, ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో అతడు ,ఖలేజా చిత్రాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మూడో మూవీ రాబోతుంది. పూజా హగ్దే హీరోయిన్.

follow us