Exclusive : పండగ రోజున మహేష్ బాబు సినిమా లాంచ్..!

mahesh babu next movie with trivikram
mahesh babu next movie with trivikram

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తరవత మహేష్ ఏ దర్శకుడి సినిమాలో నటిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తో మహేష్ నెక్స్ట్ సినిమా దాదాపు కన్ఫామ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథ మహేష్ కు నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే పలువురు డైరెక్టర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రిన్స్ ఈ సినిమా తరవత ఏ దర్శకుడి సినిమాలో నటిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

కాగా తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం సర్కారు వారి పాట పూర్తి చేసుకున్న తరవాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ కు కథ చెప్పగా బాగా నచ్చిందంట. అంతే కాకుండా ఈ సినిమాను ఉగాది లేదా శ్రీరామనవమి రోజున అధికారికంగా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే ఇది ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారమే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. వీటిలో అతడు సూపర్ హిట్ కాగా ఖలేజా సూపర్ హిట్ కాకపోయినా కల్ట్ మూవీగా నిలిచింది.