మహేష్ కు థ్యాంక్స్ చెప్పిన అనసూయ

  • Written By: Last Updated:
మహేష్ కు థ్యాంక్స్ చెప్పిన అనసూయ

విభిన్నమైన సినిమాలతో అలరిస్తోంది బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ. సినిమాల్లో విభిన్నమైన పాత్రలకు తన ఓటు అని తన ఎంపికలతో నిరూపిస్తూనే ఉంది. రంగస్థలం తర్వాత అనసూయ మరో స్ట్రాంగ్ రోల్ పోషించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’.

ఈ చిత్రంలో అనసూయ గర్భవతి పాత్రలో కనిపించనుంది. విరాజ్ అశ్విన్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు. మౌనిక రెడ్డి, హర్ష చెముడు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. రమేష్ రాపర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలు. థాంక్యూ బ్రదర్ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రమోషన్స్ లో నిమగ్నమైంది.

ఈరోజు ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయడం విశేషం. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ.. ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. ఈ సినిమా పోస్టర్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని తెలిపాడు. మహేష్ బాబు ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసినందుకు గానూ ఆయనకు చిత్ర దర్శక నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. అనసూయ కూడా దీనిపై స్పందిస్తూ ‘థాంక్యూ మహేష్ బాబు సర్’ అని తన ట్విట్టర్‌లో పేర్కొంది. కాగా ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

follow us