సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్ !

  • Written By: Last Updated:
సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్ !

“సరిలేరు నీకేవ్వరు” చిత్రం తరువాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు పరుశురామ్, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్, జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. మహేష్ తన అభిమానులకోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వుతు వస్తున్నాడు. మహేష్ ఈ చిత్రం కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఏ సినిమాకైన ఫస్ట్ ఆఫ్ లో ఇంటెర్వెల్ కు ముందు వచ్చే సీన్స్, సెకండ్ ఆఫ్ లో లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ సీన్స్ బాగా ప్లస్ అవ్వుతాయి.

సర్కారు వారి పాట సినిమాకు కూడా ఇంటెర్వెల్ లో వచ్చే సీన్స్ కీలకం కానున్నాయంట, అందుకోసం ఓ సెంట్రల్ బ్యాంక్ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటి లో ఆర్ట్ డైరక్టర్ తోట తరణి అధ్వర్యంలో నిర్మించారు. ఈ చిత్రం యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు, కుంభకోణాల, చుట్టూ ఉంటుందంట. అలాగే మంచి రొమాన్స్ తో కూడిన లవ్ ట్రాక్ ఉంటుందని తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమాలు చూసినట్లు అయితే సెపరేట్ ట్రాక్ ఏర్పాటు చేసుకుని వెల్లుతున్నాడు. మహర్షి సినిమాలో ఫ్రెండ్ కోసం అండగా నిలబడి రైతు సమస్యలపై పోరాడే ఓ గొప్ప సి‌ఈ‌ఓ గా నటించాడు, అలాగే భరత్ అనే నేను సినిమాలో ఆంధ్రప్రదేశ్ కి సి‌ఎం గా అధ్భుతమైన నటన ను కనబరిచాడు.ఇలా పలు సినిమాలో ఓ డిఫ్ఫరెంట్ వే లో వెల్లుతున్న మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో లవర్ బాయ్ గా కూడా కనిపించబోతున్నాడు. అందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో మహేష్ బాబు కు సంబందించిన ఫోటోస్ చూసినట్లైతే తెలుస్తుంది. మహేష్ ఈసారి కాస్త ట్రాక్ మార్చినట్లు అనిపిస్తుంది.

follow us