మహేష్ రూపాయి స్టోరీ అదిరింది !

మహేష్ రూపాయి స్టోరీ అదిరింది !

“గీత గోవిందం” సినిమా తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం “సర్కారు వారి పాట”. ఈ చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. “సరిలేరు నికేవ్వరు” చిత్రం తర్వాత మహేష్ బాబు మరో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. దర్శకుడు ఈ చిత్రం యొక్క టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రంలో మహేష్ బాబు రూపాయిని టాస్ మాదిరిగా గాల్లోకి ఎగరవేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చెయ్యడంతో ఈ చిత్రం యొక్క కథపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సర్కార్ వారి పాట కు సంబందించిన రూపాయి కథ ఏమిటి అంటే.. ఇండియన్ బ్యాంక్స్ దగ్గర వందల కోట్లు అప్పులు చేసి విదేశాలకు వెళ్ళి దాచుకునే వాళ్ల తాట తీసే ఓ యువకుని కథ అని తెలుస్తుంది. పోస్టర్ కథ మాత్రం వేరే ఉంది.

చిన్నప్పుడే అమ్మ నాన్న ను కోల్పోవడంతో డబ్బు విలువ బాగా తెలిసి రావడంతో.. న్యాయమైన పద్దతిలో డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని.. తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా లెక్కే అనే విదంగా బ్రతికే ఓ వ్యక్తికి డబ్బు సంపాదించడంను ఎంచుకునే మార్గంలో ఎదురయ్యే …. అక్కడి నుండే అసలు కథ మొదలవ్వుతుంది.

ఈ లైన్ ను పరుశురామ్ తనదైన స్టయిల్ లో మహేష్ తో “సర్కార్ వారి పాట” చిత్రం తీస్తున్నాడు. అమెరికాలో కరోనా అధికంగా ఉండటంతో అక్కడ చెయ్యాలిసిన షెడ్యూల్ ను హైదరాబాద్ లో చెయ్యనున్నారు. సర్కారు వారి పాట రూపాయి కథ వింటుంటే చిరంజీవి నటించిన ఛాలెంజ్, రజినీకాంత్ శివాజీ సినిమాలు గుర్తుకు వస్తాయి.. కానీ ఆ చిత్రాలకు ఈ కథకు ఏ సంబందం లేదు.

follow us