మహేశ్ బాబుకు మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ.. ?

ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరుషురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తరవాత మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో గతంలో కలేజా, అతడు సినిమాలు వచ్చాయి. ఇక పదకొండేళ్ల తరవాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.ఈ నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమాపై రోజుకో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కూడా నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దిశా లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇప్పడు మహేశ్ కు జోడీగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిధి కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక ఇద్దరు హీరోయిన్ లతో మహేశ్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.